TS : 20మంది వస్తానంటే నేనే వద్దన్నా.. కేసీఆర్‌ కామెంట్స్‌పై చర్చ

TS : 20మంది వస్తానంటే నేనే వద్దన్నా.. కేసీఆర్‌ కామెంట్స్‌పై చర్చ

కవిత అరెస్ట్ పై గురువారం తొలిసారి స్పందించారు గులాబీ బాస్, ఆమె తండ్రి కేసీఆర్. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు కేసీఆర్. కేంద్రం బీఆర్‌ఎస్‌పై పన్నిన కుట్ర అని ఆరోపించారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌పై కేసు నమోదు చేయకపోయి ఉంటే.. కవిత అరెస్ట్ జరిగేది కాదన్నారు కేసీఆర్. ఇది ప్రతీకార కుట్ర కోణంలో చేసిందని కేసీఆర్ చెప్పడం విశేషం.

తెలంగాణ భవన్‌లో గురువారం బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చారు కేసీఆర్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ఇతర నాయకులతో కేసీఆర్‌ సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల ఖర్చు కోసం ఈసీ రూల్స్ కు అనుగుణంగా ఒక్కొక్కరికి రూ.95 లక్షల చెక్కును అందజేశారు.

కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత ఒకరు తనతో టచ్ లో ఉన్నారని కేసీఆర్ చెప్పడం హాట్ టాపిక్ అయింది. కాంగ్రెస్ లో అంతా బీజేపీ జపం చేస్తున్నారని.. అనుమతిస్తే 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ లోకి వస్తానని తనతో చెప్పినా తానే ఇపుడు వద్దన్న సంగతి అందరికీ చెప్పారు కేసీఆర్. కాంగ్రెస్‌లో చేరడానికి పార్టీని విడిచిపెట్టిన వారు ఆందోళనలో ఉన్నారని కేసీఆర్‌ బాంబు పేల్చారు. 64 మంది ఎమ్మెల్యేలే ఉన్న కాంగ్రెస్ ను బీజేపీ అంత తేలిగ్గా వదిలిపెట్టదని అన్నారు. బీజేపీ కథ నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలుతుందని.. తర్వాత వచ్చేది మన ప్రభుత్వమేనని అన్నారు కేసీఆర్. త్వరలోనే బస్సుయాత్రలో ఉద్యమ కేసీఆర్ ను చూపిస్తానని అన్నారు కేసీఆర్.

Tags

Read MoreRead Less
Next Story