AP : జగన్‌పై రాయి విసిరిన నిందితుడికి కస్టడీ

AP : జగన్‌పై రాయి విసిరిన నిందితుడికి కస్టడీ

ఏపీ సీఎం జగన్ పై రాయితో దాడి చేసిన యువకుడు సతీశ్ ను విజయవాడ కోర్టు గురువారం 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి పంపింది. పోలీసులు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో సతీష్‌ను హాజరుపరచగా, మే 2 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

ఏప్రిల్ 13న విజయవాడలో జరిగిన ఘటనకు సంబంధించి జరిగిన తొలి అరెస్టు ఇది. నగరంలోని వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అజిత్ సింగ్ నగర్‌లోని దాబకోట్లు సెంటర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రిపై సతీశ్ రాయి విసిరాడని పోలీసులు అంటున్నారు. జగన్ మోహన్ రెడ్డికి కనుబొమ్మపై గాయం కాగా, పక్కనే ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కంటికి గాయమైంది.

ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు మరుసటి రోజు గుర్తుతెలియని వ్యక్తులపై హత్యాయత్నం నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పలువురు అనుమానితులను విచారించిన పోలీసులు దినసరి కూలీగా పనిచేస్తున్న సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వెనుక ఎవరు ఉన్నారు తెలుసుకునేందుకు కస్టడీ కోరగా కోర్టు అనుమతించింది.

Tags

Read MoreRead Less
Next Story